తెలంగాణ

telangana

కేటీఆర్... సీఎం హోదాలో కేబినెట్ మీటింగ్ ఎలా పెడ‌తాడు?

By

Published : Aug 13, 2020, 9:02 PM IST

బుధ‌వారం ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్‌లో.. కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ కేబినెట్ సమావేశాన్ని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క తప్పుపట్టారు. సీఎం అధికార నివాసంలో.. కేటీఆర్ ఏ హోదాలో, ఏ నిబంధల ప్రకారం కేబినెట్ భేటీ నిర్వహించార‌ని ప్ర‌శ్నించారు. మంత్రిమండలి భేటీకి కూడా హాజరు కాలేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఉన్నారన్న అనుమానం రేకెత్తుతోందని విమర్శించారు.

Bhatti fires on KCR Cabinet
కేటీఆర్... సీఎం హోదాలో కేబినెట్ మీటింగ్ ఎలా పెడ‌తాడు?

ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుండా మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి అనేక పాలనాపరమైన అనుమానాలకు తెరలేపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క‌ ఆరోపించారు. మంత్రిమండలి సమావేశాలు, ప్రభుత్వ పాలన అంటే కేసీఆర్, ఆయన కుటుంబ వ్యవహారం కాదని.. కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

ప్రగతి భవన్‌లో కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిందనే వార్తలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం చూసి ప్రజలతో పాటు తమకు చాలా ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. కరోనా మహమ్మారితో రాష్ట్రం మొత్తం అల్లాడుతోండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి.. ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీ వంటి అంశాల మీద ముఖ్యమంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష జరపటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లు సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: పొంగిపొర్లుతున్న లక్నవరం చెరువు, జంపన్న వాగు

ABOUT THE AUTHOR

...view details