తెలంగాణ

telangana

ETV Bharat / city

దేదీప్యమానంగా 'భరతమాత మహాహారతి' - తెలంగాణ తాజా వార్తలు

భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'భరతమాత మహాహారతి' కార్యక్రమం ఘనంగా జరిగింది. హాజరైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.. భరతమాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

bharathamatha maha harathi
దేదీప్యమానంగా 'భరతమాత మహాహారతి'

By

Published : Jan 26, 2021, 10:44 PM IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లో 'భరతమాత మహాహారతి' కార్యక్రమం దేదీప్యమానంగా జరిగింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్​రావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, భాజపా నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భరతమాత విగ్రహం వద్ద కిషన్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతృక దేవతారాధనలో పాల్గొన్నారు. విద్యుద్దీపాలంకరణల మధ్య కనులపండువగా జరిగిన మహాహారతి కార్యక్రమంలో విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

దేదీప్యమానంగా 'భరతమాత మహాహారతి'

ఇవీచూడండి:ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ: గవర్నర్​

ABOUT THE AUTHOR

...view details