తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీ - bharat biotech spokespersons met wise president

హైదరాబాద్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా కలిశారు. కరోనా వ్యాక్సిన్ (కొవాగ్జిన్) స్థితి, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికలపై ఉపరాష్ట్రపతితో చర్చించారు.

bharat biotech spokespersons met wise president venkaiah naidu in Hyderabad
ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ ప్రతినిధులు

By

Published : Dec 25, 2020, 4:59 PM IST

Updated : Dec 25, 2020, 7:07 PM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును హైదరాబాద్​లో భారత్ బయోటెక్ ఛైర్మన్&ఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా కలిశారు. కరోనా వ్యాక్సిన్ స్థితి, భారత్​ దేశంలో, ప్రపంచంలో కొవాగ్జిన్​ను​ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికలను చర్చించారు.

ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్​), నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ వైరాలజీ(ఎన్​ఐవీ)లతో కలిసి ఈ వ్యాక్సిన్​ను తయారు చేసినట్లు ఉపరాష్ట్రపతికి కృష్ణ ఎల్లా తెలిపారు. భారత్​ బయోటెక్​లోని బీఎస్ఎల్ -3 (బయో-సేఫ్టీ లెవల్ 3) బయో కంటైన్మెంట్ సదుపాయంలో స్వదేశీ, క్రియారహిత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.

ఇటీవలే ప్రధాన మంత్రి మోదీ భారత్​ బయోటెక్​ను సందర్శించి కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ స్థితిపై సమీక్షించినట్లు వెంకయ్య నాయుడికి వారు తెలిపారు. జీనోమ్​ వ్యాలీలో ఉన్న సౌకర్యాలు, సదుపాయాల గురించి తెలుసుకునేందుకు వివిధ దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు సందర్శించినట్లు వెల్లడించారు.

ప్రపంచస్థాయి ఉత్పత్తుల్లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం గురించి ఉపరాష్ట్రపతి.. భారత్ బయోటెక్ ఛైర్మన్​​కు వివరించారు. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్​ల పరస్పర సహకారాన్ని కొనియాడారు.

Last Updated : Dec 25, 2020, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details