కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో అన్ని జాగ్రత్తలు పాటించామని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. శాస్త్రవేత్తలు 9నెలలు కష్టపడి పనిచేశారని చెప్పారు. కొవాగ్జిన్ పూర్తి సమాచారాన్ని నిపుణుల బృందానికి అందించామని వెల్లడించారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు అనుమతులు వస్తే కావాల్సిన డోస్‌ల సమాచారం తమకు అందించారని సుచిత్ర తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి అని పేర్కొన్నారు.
ప్రభుత్వ అనుమతులకు సిద్ధమైన కొవాగ్జిన్ : సుచిత్ర ఎల్ల - coaxin vaccine for corona by India
కొవాగ్జిన్ పూర్తి సమాచారాన్ని నిపుణుల బృందానికి అందించామని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి అని అన్నారు.
ప్రభుత్వ అనుమతులకు సిద్ధమైన కొవాగ్జిన్
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్యూరో నేచురల్స్ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. సహజసిద్ధంగా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచివని అభిప్రాయపడ్డారు. ప్యూరో నేచురల్స్తో తమకు మంచి అనుబంధం ఉందన్న సుచిత్ర ఎల్ల.... రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేసి విక్రయించటం సంస్థ ప్రత్యేకతగా పేర్కొన్నారు.
- ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 461 కరోనా కేసులు, 3 మరణాలు
Last Updated : Jan 1, 2021, 5:32 PM IST