తెలంగాణ

telangana

ETV Bharat / city

నిరంతరం పనిచేస్తున్నాం.. నిందలు సరికాదు: సుచిత్ర ఎల్లా - భారత్ బయోటెక్ తాజా వార్తలు

కరోనా కష్టకాలంలో ప్రజలకు వాక్సిన్ అందించేందుకు నిరంతరం పనిచేస్తున్నామని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. తమపై దురుద్దేశాలు ఆపాదించేలా కొన్ని రాష్ట్రాలు వ్యాఖ్యలు చేయడం ఆవేదన కలిగిస్తుందన్నారు. వాక్సిన్ విషయంలో అన్ని రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇస్తున్నామన్నామని ఆమె స్పష్టం చేశారు.

bharat biotech jmd
bharat biotech jmd

By

Published : May 12, 2021, 4:10 PM IST

కరోనా విపత్కాలంలో ప్రజలకు వాక్సిన్ అందించేందుకు తమ సంస్థ నిరంతరం పనిచేస్తోందని.. భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. టీకా పంపిణీలో అన్ని రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తమకు దురుద్దేశాలు ఆపాదించేలా కొన్ని రాష్ట్రాలు వ్యాఖ్యలు చేయడం ఆవేదన కలిగిస్తోందంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి వాఖ్యలు వాక్సిన్ తయారీలో నిమగ్నమైన తమ సిబ్బందిని బాధకు గురిచేస్తున్నాయన్నారు. మే 10న 18 రాష్ట్రాలకు వాక్సిన్ సరఫరా చేసినట్లు ట్వీట్​లో పేర్కొన్నారు.

కరోనా కారణంగా 50 మంది ఉద్యోగులు విధులకు హాజరు కావడంలేదని.. అయినా వాక్సిన్​ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. మే 1 నుంచి రాష్ట్రాలకు వాక్సిన్​ అందించేందుకు నిరంతరంగా పనిచేస్తున్నామని భారత్ బయోటెక్ సంస్థ మరో ట్వీట్ చేసింది.

ఇవీచూడండి:ఎన్టీఆర్​తో మాట్లాడిన చిరు.. ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details