నిమ్స్‌లో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం - covaxin clinical trails
10:40 July 07
నిమ్స్‌లో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం
రాష్ట్రంలో నేటి నుంచి కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇందుకు ఆరోగ్యవంతులైన వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. నిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పరీక్షలు చేయనున్నారు.
ట్రయల్స్‌కు సమ్మతించిన వారికి వైద్య పరీక్షల నిర్వహిస్తామని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ వెల్లడించారు. ఆరోగ్యవంతుల నుంచి రక్త నమూనాల సేకరిస్తామని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వారికి మొదటి డోస్ ఇస్తామని.. అనంతరం ఆస్పత్రిలోనే రెండు రోజుల పాటు పర్యవేక్షిస్తామని ప్రకటించారు. 14 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తామని తెలిపారు. ట్రయల్స్‌లో భాగంగా ఒక్కో వ్యక్తికి 3 డోసులు ఇస్తామని నిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు.