జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందిన భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల ఈ పురస్కారం ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌కు దక్కినట్లు భావిస్తున్నానని తెలిపారు. ఎలాంటి మహమ్మారికైనా హైదరాబాద్ నుంచే టీకాలు రావాలని అన్నారు. 65 శాతం వ్యాక్సిన్లు భాగ్యనగరం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. అతిపెద్ద తయారీ హబ్‌గా ఈ నగరం సత్తా చాటుతోందని చెప్పారు. జినోమ్ వ్యాలీ ప్రపంచంలోనే బెస్ట్ హబ్ అని పేర్కొన్నారు.
'ఏ మహమ్మారికైనా హైదరాబాద్ నుంచే టీకా రావాలి'
భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రా ఎల్లాను జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. ఈ పురస్కారం తన ఒక్కరిది కాదని.. ఫార్మా, లైఫ్ సెన్సెస్ ఎకోసిస్టమ్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. జీవశాస్త్ర రంగంలో ఉత్తమ సేవలందించినందుకు బయో ఆసియా 2021లో జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పురస్కారం ఈ ఏడు భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలకు దక్కింది.
భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల
హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఆసియా 2021 సదస్సులో జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించే వారికి ఏటా జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డులు అందజేస్తారు. ఈ ఏడాది.. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల ఈ పురస్కారాలు అందుకున్నారు.
Last Updated : Feb 22, 2021, 2:15 PM IST