తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్‌

bharat bio tech
కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్‌

By

Published : May 9, 2020, 8:32 PM IST

Updated : May 9, 2020, 9:14 PM IST

20:22 May 09

కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్‌

 కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి  హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్, కేంద్ర వైద్య పరిశోధన సంస్థ(ఐసీఎంఆర్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. వ్యాక్సిన్ తయారీలో భాగంగా కరోనా వైరస్ స్ట్రెయిన్స్​ను వేరు చేసి ఈ వ్యాక్సిన్​ను అభివృద్ధి పరచనున్నారు.  

ఒప్పందంలో భాగంగా వ్యాక్సిన్ తయారీ కోసం పూణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్, ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్​కు సహకారం అందించనున్నాయి. వ్యాక్సిన్​ ప్రయోగంలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేశాయి. భారత్ బయోటెక్​కు అవసరమైన అనుమతులు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది.  

అంతర్జాతీయ ప్రాధాన్యమున్న ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం గర్వంగా ఉందని.. భారత్ బయోటెక్ సీఎండీ డా. క్రిష్ణా ఎల్లా తెలిపారు. బయోసేఫ్టీ లెవల్-3 సామర్థ్యాన్ని  తాము కలిగి ఉన్నామని కృష్ణా ఎల్లా ప్రకటించారు.  

ఇవీచూడండి:యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు అనుమతి

Last Updated : May 9, 2020, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details