తెలంగాణ

telangana

ETV Bharat / city

Bharat Bandh: పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం - రైతుల కోసం భారత్ బంద్

Live updates
భారత్‌ బంద్‌

By

Published : Sep 27, 2021, 6:33 AM IST

Updated : Sep 27, 2021, 1:10 PM IST

12:57 September 27

పీఎస్ ఎదుట మధుయాష్కి, చాడ, మల్లు రవి ధర్నా

  • హయత్‌నగర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన
  • నిరసనలో పాల్గొన్న మల్లు రవి, చాడ వెంకట్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి
  • నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  • వనస్థలిపురం పీఎస్ ఎదుట బైఠాయించిన కాంగ్రెస్, వామపక్ష నేతలు
  • వనస్థలిపురం పీఎస్ ఎదుట మధుయాష్కి, చాడ, మల్లు రవి ధర్నా

12:47 September 27

పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం

  • ఉప్పల్ డిపో వద్ద రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తమ్మినేని వీరభద్రంను అదుపులోకి తీసుకున్న పోలీసులు

12:22 September 27

'కేసీఆర్, మోదీ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారింది'

  • రైతు ఉద్యమానికి తొలుత కేసీఆర్ మద్దతు ఇచ్చారు: రేవంత్‌రెడ్డి
  • గతంలో రైతు బంద్‌లో కేటీఆర్ కుడా పాల్గొన్నారు: రేవంత్‌రెడ్డి
  • మోదీని కలిసిన తర్వాత కేసీఆర్‌ వైఖరి మారిపోయింది: రేవంత్
  • మోదీ ఏంమాయ చేశారో గాని కేసీఆర్‌లో మార్పు వచ్చింది: రేవంత్
  • కేసీఆర్ బంద్‌లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారు: రేవంత్
  • కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి: రేవంత్‌రెడ్డి
  • అదానీ, అంబానీలకు సాగును మోదీ తాకట్టు పెడుతున్నారు: రేవంత్
  • కేసీఆర్, మోదీ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారింది: రేవంత్
  • లక్షా 96 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ కమిషన్లే చెప్పాయి
  • రైతు శ్రేయస్సును గతంలో కాంగ్రెస్‌ కాపాడింది: రేవంత్‌రెడ్డి
  • మోదీ సర్కారు రైతును బానిసగా మార్చింది: రేవంత్‌రెడ్డి
  • సాగు చట్టాలతో రైతు భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది: రేవంత్
  • సాగు చట్టాలు రైతులు, వినియోగదారులకు మరణశాసనాలే: రేవంత్‌రెడ్డి
  • రైతుల పక్షాన పోరాడాల్సిన కేసీఆర్.. మోదీ ఒడిలో కూర్చున్నారు: రేవంత్
  • ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు
  • కేసీఆర్ ఇంట్లో, బంధువులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి: రేవంత్

11:30 September 27

ఉప్పల్ బస్ డిపో వద్ద నిరసనలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి

నిరసనలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి
  • ఉప్పల్ బస్ డిపో వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
  • ఉప్పల్ బస్ డిపో వద్ద నిరసనలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి
  • ఉప్పల్ బస్ డిపో వద్ద నిరసనలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం
  • నిరసనలో పాల్గొన్న అఖిలపక్షం నాయకులు, కార్యకర్తలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు

11:30 September 27

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిరసన

  • ఉప్పల్ బస్ డిపో వద్ద పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిరసన
  • ఉప్పల్ బస్ డిపో ఎదుట బైఠాయించిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు

11:15 September 27

రైతు, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

  • భారత్ బంద్ సందర్భంగా హైదరాబాద్‌లో ర్యాలీ
  • రైతు, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
  • చిక్కడపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ
  • నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • కేంద్ర ప్రభత్వానికి వ్యతిరేకంగా రైతు, కార్మిక, ప్రజాసంఘాల నినాదాలు

11:15 September 27

పోలీసుల అదుపులో కోదండరామ్‌

  • హైదరాబాద్‌: హయత్‌నగర్ బస్ డిపో వద్ద కోదండరామ్ నిరసన
  • భారత్ బంద్‌కు మద్దతుగా డిపో ఎదుట కోదండరామ్ ఆందోళన
  • కోదండరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

11:14 September 27

భారీగా ట్రాఫిక్ జాం

  • మహబూబ్‌నగర్: దేవరకద్రలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో
  • భారత్ బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్, వామపక్షాల రాస్తారోకో
  • దేవరకద్ర వద్ద కోదాడ-రాయ్‌చూర్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం
  • జాతీయరహదారిపై ఇరువైపులా 2కి.మీ. మేర నిలిచిన వాహనాలు

11:14 September 27

'కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర వైఖరిపై నిర్ణయం చెప్పాలి'

  • కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలి: ఎమ్మెల్యే సీతక్క
  • కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులకు తీవ్ర నష్టం: సీతక్క
  • సాగును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర: సీతక్క
  • కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర వైఖరిపై నిర్ణయం చెప్పాలి: సీతక్క

11:13 September 27

భాజపా, తెరాస ఒక్కటే

  • భాజపా, తెరాస ఒక్కటే: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
  • కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించేందుకు కేసీఆర్ భయపడుతున్నారు: జీవన్‌రెడ్డి
  • నూతన సాగు చట్టాలపై తెరాస నిర్ణయం ఏంటో చెప్పాలి: జీవన్‌రెడ్డి

10:05 September 27

ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌
  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
  • ఆర్టీసీ డిపోల ఎదుట బస్సులను అడ్డుకున్న ప్రతిపక్షాలు
  • దుకాణాలు, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేయించిన నేతలు

09:06 September 27

మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హౌస్ అరెస్టు

  • హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హౌస్ అరెస్టు
  • భారత్ బంద్‌లో పాల్గొనకుండా హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

08:47 September 27

ద్విచక్రవాహన ర్యాలీ

  • సిద్దిపేటలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్
  • సిద్దిపేటలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నేతలు

08:47 September 27

అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్

  • సిద్దిపేట: గజ్వేల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్
  • గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో ఎదుట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి నిరసన
  • కాంగ్రెస్, సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

08:35 September 27

పోలీసుల అదుపులో నిరసనకారులు

  • మెదక్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్
  • మెదక్ డిపో ఎదుట అఖిలపక్షం నాయకుల నిరసన
  • మెదక్: నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

08:35 September 27

ఆందోళనకారుల అరెస్టు

  • భారత్‌ బంద్‌కు మద్దతుగా మహబూబ్‌నగర్‌లో విపక్షాల ఆందోళన
  • మహబూబ్‌నగర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్షాల నిరసన
  • బస్టాండ్ ఎదుట బైఠాయించిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు
  • మహబూబ్‌నగర్: ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు
  • మహబూబ్‌నగర్: డిపో, బస్టాండ్‌ల నుంచి ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు

07:58 September 27

రాస్తారోకోతో రెండు కి.మీ. మేర నిలిచిపోయిన వాహనాలు

  • ఖమ్మం జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్
  • ఖమ్మం జిల్లాలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
  • ఖమ్మం బైపాస్‌ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
  • రాస్తారోకోలో పాల్గొన్న కాంగ్రెస్, వామపక్షాలు, తెదేపా నేతలు
  • రాస్తారోకోతో రెండు కి.మీ. మేర నిలిచిపోయిన వాహనాలు

07:56 September 27

మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన

  • వికారాబాద్: పరిగి ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్షం నేతల ధర్నా
  • మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతల నిరసన
  • పరిగి డిపో వద్ద బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్, వామపక్షాల నేతలు

07:46 September 27

నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు

  • నాగర్‌కర్నూర్: కొల్లాపూర్‌ బస్టాండ్‌ ఎదుట అఖిలపక్షం ధర్నా
  • నాగర్‌కర్నూర్: నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు

07:46 September 27

అఖిలపక్షం నేతల ధర్నా

  • హైదరాబాద్‌: జీడిమెట్ల డిపో ఎదుట అఖిలపక్షం నేతల ధర్నా
  • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

07:45 September 27

ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా

  • సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
  • నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని అఖిలపక్షం నేతల డిమాండ్

07:45 September 27

కాంగ్రెస్, వామపక్షాల ఆందోళన

  • కోదాడ, మిర్యాలగూడలో కాంగ్రెస్, వామపక్షాల ఆందోళన
  • కోదాడ డిపో ఎదుట కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెదేపా ధర్నా
  • మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్, వామపక్షాల నిరసన

07:45 September 27

అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్

  • నిజామాబాద్: అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్
  • నిజామాబాద్ బస్టాండ్ వద్ద అఖిలపక్షం నాయకుల నిరసన

07:44 September 27

డిపో ఎదుట బైఠాయించిన నేతలు

  • గద్వాల ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్షం నాయకుల ఆందోళన
  • భారత్ బంద్‌కు మద్దతుగా డిపో ఎదుట బైఠాయించిన నేతలు
  • గద్వాల: ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

07:44 September 27

ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • భారత్ బంద్‌కు మద్దతుగా యాదగిరిగుట్టలో విపక్షాల ధర్నా
  • యాదగిరిగుట్ట డిపో ఎదుట కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఆందోళన
  • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

06:53 September 27

మహబూబ్‌నగర్‌లో విపక్షాల ఆందోళన

  • భారత్‌ బంద్‌కు మద్దతుగా మహబూబ్‌నగర్‌లో విపక్షాల ఆందోళన
  • మహబూబ్‌నగర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్షాల నిరసన
  • బస్టాండ్ ఎదుట బైఠాయించిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు
  • మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో డిపోలకే పరిమితమైన బస్సులు
  • మహబూబ్‌నగర్ రీజియన్‌ పరిధిలో నిలిచిన 842 బస్సులు

06:45 September 27

ఆందోళనకారులు అరెస్టు

హనుమకొండలో నిరసన
  • భారత్‌ బంద్‌కు మద్దతుగా హనుమకొండలో నిరసన
  • హనుమకొండ బస్టాండ్‌ వద్ద బస్సులను అడ్డుకున్న వామపక్షాలు
  • హనుమకొండ: పోలీసులు, వామపక్ష నేతల మధ్య తోపులాట
  • హనుమకొండ: ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు

06:30 September 27

వామపక్ష నేతల అరెస్టు

  • నల్గొండలో వామపక్ష నేతల అరెస్టు
  • భారత్‌బంద్‌లో భాగంగా వామపక్ష నేతల ఆందోళన
  • నల్గొండ: జిల్లాలో యథావిధిగా కొనసాగుతున్న ఆర్టీసీ బస్సులు

06:30 September 27

బస్సులను అడ్డుకుంటున్న వామపక్ష నాయకులు

  • హనుమకొండలోని బస్టాండ్‌ ఎదుట వామపక్షాల ఆందోళన
  • భారత్‌ బంద్‌లో భాగంగా వామపక్షాల ఆందోళన
  • రోడ్డుపై బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్న వామపక్ష నాయకులు

06:09 September 27

నూతన సాగు చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్‌తో నిరసనలు

  • నేడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
  • నూతన సాగు చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్‌తో నిరసనలు
  • సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న నిరసనలు
  • రాజకీయాలకతీతంగా ప్రజలు పాల్గొనాలని సంయుక్త కిసాన్‌ మోర్చా విజ్ఞప్తి 
  • బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ సహా విపక్షాలు
  • రైతులతో కలిసి బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్‌, ఆప్‌, ఎస్పీ, బీఎస్పీ ప్రకటన
  • రైతుల ఆందోళన దృష్ట్యా దిల్లీ పోలీసులు అప్రమత్తం 
  • ఇండియా గేట్‌, ముఖ్య ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు
  • నిరసన శిబిరాల నుంచి దిల్లీలోకి ఎవరూ రాకుండా పోలీసుల చర్యలు
  • తెలంగాణలో బంద్‌లో పాల్గొననున్న కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు
  • ఏపీలో బంద్‌కు మద్దతిస్తున్నట్లు వైకాపా, తెదేపా ప్రకటన
Last Updated : Sep 27, 2021, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details