ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు సంఘాల సమాఖ్య భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. కానీ.. నగరంలో రవాణా వ్యవస్థకు ఎక్కడా ఆటంకం ఏర్పడలేదు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు నడిచాయి. మెట్రో రైళ్లూ యథావిధిగా కొనసాగుతున్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి.
హైదరాబాద్‌లో కనిపించని భారత్ బంద్ ప్రభావం - Bharat Bandh did not continued in Hyderabad
భాగ్యనగరంపై భారత్ బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు సంఘాల సమాఖ్య బంద్‌కు పిలుపునిచ్చినా.. నగరంలో రవాణా వ్యవస్థకు ఎక్కడా ఆటంకం ఏర్పడలేదు.
![హైదరాబాద్‌లో కనిపించని భారత్ బంద్ ప్రభావం bharat bandh, vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11163235-882-11163235-1616733207255.jpg)
భాగ్యనగరంలో భారత్ బంద్
ఉద్యోగాలకు వెళ్లే వారంతా రోజులాగే ఇళ్ల నుంచి బయలుదేరి కార్యాలయాలకు చేరుకున్నారు. అఖిల భారత వర్తక సమాఖ్య కూడా బంద్‌లో పాల్గొనబోమని ఇదివరకే ప్రకటించింది.
- ఇదీ చదవండి :రోడ్డెక్కిన రైతులు... రహదారుల దిగ్బంధం