ఈనెల 12న ఉదయం 8 గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం వేస్తామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంతరావు తెలిపారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నిమజ్జనానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్, స్వామి ప్రజ్ఞానంద్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ఈనెల 10న రవీంద్రభారతిలో భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శోభాయాత్ర రోజున గంగా హారతి ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షనీయమన్నారు.
బాలాపూర్ గణేశ్ నిమజ్జనానికి మోహన్ భగవత్ - bhagyanagar ganesh utsav samithi
బాలాపూర్ గణేశ్ నిమజ్జనానికి ముఖ్యఅతిథిగా మోహన్ భగవత్, స్వామి ప్రజ్ఞానంద్ హాజరవుతారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంతరావు తెలిపారు. అనంత చతుర్దశి రోజున మాత్రమే నిమజ్జనం చేయాలని తెలిపారు. మండపాల వద్ద డీజేలు, సినిమా పాటలు ఏర్పాటు చేయొద్దని సూచించారు.
బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి మోహన్ భగవత్