తెలంగాణ

telangana

ETV Bharat / city

Aasara Pensions in Telangana : ఆసరా పింఛను కోసం మూడేళ్లుగా నిరీక్షణ - తెలంగాణలో ఆసరా పింఛన్లు

Aasara Pensions in Telangana : రాష్ట్రంలో మూడేళ్లుగా పింఛన్లు మంజూరు కాలేదు. పింఛను కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 11 లక్షలు దాటింది. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీల కింద దరఖాస్తు చేసిన 3.30 లక్షల మందికి పింఛను మంజూరు కాలేదు. వీటి పరిష్కారం కోసం ఈనెల 28న ప్రజాభిప్రాయ సేకరణ, ధర్నా నిర్వహించనున్నట్లు 20 ప్రజా సంఘాలతో కూడిన ఆసరా పింఛను సాధన కమిటీ ప్రకటించింది.

Aasara Pensions in Telangana
Aasara Pensions in Telangana

By

Published : Feb 25, 2022, 9:19 AM IST

Aasara Pensions in Telangana : రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, ఇంటిపెద్దను కోల్పోయి వితంతువుగా మారిన మహిళలు, ఇతర కేటగిరీల కింద దరఖాస్తు చేసిన 3.30 లక్షల మందికి పింఛను మంజూరు కాలేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నా, రాష్ట్రస్థాయిలో ఆమోదం లభించడంలేదు. వృద్ధాప్య పింఛను అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించిన తరువాత వచ్చిన 7.8 లక్షలకు పైగా దరఖాస్తులు వీటికి అదనం. మొత్తంగా పింఛను కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య 11 లక్షలు దాటింది. వీటి పరిష్కారం కోసం ఈ నెల 28న ప్రజాభిప్రాయ సేకరణ, ధర్నా నిర్వహించనున్నట్లు 20 ప్రజా సంఘాలతో కూడిన ఆసరా పింఛను సాధన కమిటీ ప్రకటించింది.

నెలకు రూ.220 కోట్లు అవసరం..

Aasara Pensions : రాష్ట్రంలో గత మూడేళ్లుగా పింఛను కోసం అందిన దరఖాస్తులన్నీ రాష్ట్రస్థాయి లాగిన్‌లో నిలిచిపోయాయి. కొత్త దరఖాస్తుదారులకు పింఛను చెల్లించాలంటే నెలకు రూ.62 కోట్ల వరకు అవసరమని అంచనా. 57 ఏళ్ల వారి దరఖాస్తులనూ పరిష్కరిస్తే మరో రూ.158 కోట్లు కావాలి.

ABOUT THE AUTHOR

...view details