తెలంగాణ

telangana

ETV Bharat / city

వివాదాల్లో ఎస్పీలు.. ఐపీఎస్​లను నియమించకపోవడమే కారణమా..? - పోలీసుల తీరు

Behavior of police officers: రాష్ట్రంలో రెగ్యులర్‌ అధికారులను కాదని పదోన్నతులు పొందిన అధికారులకు ఎస్పీ బాధ్యతలు అప్పగించడంతో, వారు తరచూ వివాదాల్లో చిక్కుకోవడంతో పెద్ద సమస్యగా మారింది. తాజాగా సూర్యాపేటలో జరిగిన సంఘటన దీనికి ఊతమిస్తోంది.

police
పోలీసులు

By

Published : Sep 18, 2022, 6:42 AM IST

Behavior of police officers: తెలంగాణలో రెగ్యులర్‌ ఐపీఎస్‌లను కాదని పదోన్నతి పొందిన అధికారులకు జిల్లా ఎస్పీల బాధ్యతలు అప్పగించడం తరచూ చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి కొందరు అధికారులు వివాదాల్లో చిక్కుకుపోవడం పోలీస్‌శాఖలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పలువురు యువ ఐపీఎస్‌లు చాలా రోజులుగా పోస్టింగ్‌ల కోసం నిరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు ఏళ్ల తరబడి గ్రేహౌండ్స్‌కే పరిమితమయ్యారు. గుడ్డిలో మెల్ల చందంగా ఇటీవలే వీరికి అటాచ్‌మెంట్లు ఇచ్చారు. అయితే ఈ తరహా పోస్టింగ్‌లతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వారిది.

ఓ వైపు ఇలా పదుల సంఖ్యలో యువ ఐపీఎస్‌లు పోస్టింగ్‌ల కోసం నిరీక్షిస్తుండగా మరోవైపు ఐపీఎస్‌ హోదా పొందకుండానే ఏడుగురు జిల్లా ఎస్పీలుగా కొనసాగుతున్నారు. ఈ జాబితాలో వెంకటేశ్వర్లు(మహబూబ్‌నగర్‌), సురేందర్‌రెడ్డి(భూపాలపల్లి), రంజన్‌రజత్‌ కుమార్‌(గద్వాల), శ్రీనివాసరెడ్డి(కామారెడ్డి), వెంకటేశ్వర్లు(నారాయణపేట), రమణకుమార్‌(సంగారెడ్డి), మనోహర్‌(నాగర్‌కర్నూల్‌) ఉన్నారు. పదోన్నతుల ద్వారా ఐపీఎస్‌ హోదా పొంది ఎస్పీలుగా కొనసాగుతున్న వారిలో కోటిరెడ్డి(వికారాబాద్‌), ప్రవీణ్‌కుమార్‌(నిర్మల్‌), సురేశ్‌కుమార్‌(ఆసిఫాబాద్‌), ఉదయ్‌కుమార్‌రెడ్డి(ఆదిలాబాద్‌), రాజేంద్రప్రసాద్‌(సూర్యాపేట) ఉన్నారు. వీరిలో పలువురు పదోన్నతి పొందకముందే జిల్లా ఎస్పీలుగా నియమితులు కావడం గమనార్హం.

మొన్న మహబూబ్‌నగర్‌ ఎస్పీ ఉదంతం మరవకముందే తాజాగా సూర్యాపేట ఎస్పీ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్‌నగర్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు దగ్గరుండి మరీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో ఓ ర్యాలీలో బ్లాంక్‌ ఆమ్యూనేషన్‌తో గాల్లోకి కాల్పులు జరిపించడం సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా సూర్యాపేటలో శుక్రవారం జరిగిన వజ్రోత్సవ సభలో బహిరంగ వేదికపైనే ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మంత్రి జగదీశ్‌రెడ్డికి జయహో అనడమే కాకుండా సభికులతో జైకొట్టించడం వివాదస్పదమైంది. పోలీస్‌శాఖలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో రాజకీయ పోస్టింగ్‌ల ప్రచారం జోరుగా ఉన్న తరుణంలో జిల్లా ఎస్పీలూ వివాదాల్లో చిక్కుతుండటం విస్మయపరుస్తోంది. విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ సిబ్బంది స్ఫూర్తిగా నిలవాల్సిన తరుణంలో ఇలా వివాదాలకు చిరునామాగా మారుతుండటం విమర్శలకు తావిస్తోంది.

ఐపీఎస్‌ల నిరీక్షణ జాబితా ఇది..
వెయిటింగ్‌లో ఉన్న రెగ్యులర్‌ ఐపీఎస్‌లు:భాస్కరన్‌, చేతన మైలాబత్తుల, సునీల్‌దత్‌, కారే కిరణ్‌ ప్రభాకర్‌, రూపేష్‌, నిఖితపంత్‌.

పదోన్నతి ద్వారా ఐపీఎస్‌ హోదా పొంది వెయిటింగ్‌లో ఉన్న అధికారులు:ఎల్‌.ఎస్‌.చౌహన్‌, నారాయణనాయక్‌, పి.వి.పద్మజ, తిరుపతి, గిరిధర్‌.

అటాచ్‌మెంట్‌లో ఉన్న రెగ్యులర్‌ ఐపీఎస్‌లు:అభిషేక్‌ మహంతి, విజయ్‌కుమార్‌, రక్షితమూర్తి, యోగేశ్‌గౌతమ్‌, స్నేహమెహ్రా, హర్షవర్ధన్‌, గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, రితీరాజ్‌, బాలస్వామి, కేకన్‌ సుధీర్‌ రామనాథ్‌, అక్షాంశ్‌యాదవ్‌, అశోక్‌కుమార్‌, సాధనరష్మీ పెరుమాల్‌.

పదోన్నతి ద్వారా ఐపీఎస్‌ హోదా పొంది అటాచ్‌మెంట్‌లో ఉన్న అధికారులు:యాదగిరి, నారాయణ, అనసూయ, షేక్‌సలీమా.

శిక్షణలో ఉన్న రెగ్యులర్‌ ఐపీఎస్‌లు:పరితోష్‌ పంకజ్‌, పాటిల్‌ కాంతిలాల్‌ సుభాష్‌, సిరిశెట్టి సంకీర్త్‌.

తెలంగాణ కేడర్‌కు ఇటీవలే నియమితులైన రెగ్యులర్‌ ఐపీఎస్‌లు:అవినాశ్‌కుమార్‌, కాజల్‌, కంకణాల రాహుల్‌రెడ్డి, శివం ఉపాధ్యాయ, శేషాద్రినిరెడ్డి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details