తెలంగాణ

telangana

ETV Bharat / city

రాబోయే రెండు రోజులు బీ అలర్ట్​.. పెరగనున్న చలి తీవ్రత - హైదరాబాద్​ వాతావరణ శాఖ

రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తోంది. రాబోయే రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరుగనుందని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఈశాన్య తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది.

intensity of the rising cold
పెరగనున్న చలి తీవ్రత

By

Published : Dec 26, 2020, 2:34 PM IST

తెలంగాణ వ్యాప్తంగా చలి వణికిస్తోంది. రాబోయే రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి రెండు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో శీతల గాలుల పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈశాన్య తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:'అన్నదాతల ఆవేదనను కేంద్రం వినాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details