ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ అందాలు ఎంతచూసినా తక్కువే. శీతాకాలంలో ఈ ప్రాంత సోయగాలు చూపరులను మరింత మైమరపిస్తాయి. వేకువజామున పచ్చని చెట్లపై తెల్లని మంచు మెరుస్తూ కనుల విందుగా కనిపిస్తుంది. సొగసు చూడతరమా.. అంటూ ప్రకృతి ప్రేమికులు మురిసిపోతారు. స్వర్గం ఇక్కడే ఉందన్నట్లుగా తన్మయం చెందుతారు.
ఏపీ:మంచుకురిసే వేళలో కోనసీమ అందాలు చూడతరమా.. - beauty of konaseema
ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు ఏపీలోని కోనసీమ. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే ఈ ప్రాంతం ఇప్పుడు మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. మంచు దుప్పటి కప్పుకుని చూపరులను ఆకట్టుకుంటోంది.
ఏపీ:మంచుకురిసే వేళలో కోనసీమ అందాలు చూడతరమా..