ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా... - taja news of kurnool dst water fall
ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండ ప్రాంతం నుంచి జాలువారే సహజసిద్ధ నీటి అందాలు ఆకట్టుకుంటున్నాయి.

ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న అందాలు
కర్నూల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కొత్త అందాలు అద్దుకున్నాయి. ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం ప్రాంతంలోని జలపాతాలు చూడాలంటే మాత్రం అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే.