అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో ఓ ఎలుగుబంటి చిక్కుకుంది. ఏపీలోని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లిలో అడవి పందులు వేరు శనగ పంటను నాశనం చేస్తున్నాయి. వీటి నుంచి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు ఉచ్చును ఏర్పాటు చేశారు. గత రాత్రి ఈ ఉచ్చులో ఓ ఎలుగుబంటి చిక్కుంది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అడవి పందుల వలలో.. ఎలుగుబంటి పడింది!