Bear tension in Anantapur: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇటీవల ఎలుగుబంటుల సంచారం అధికమైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవలే కళ్యాణదుర్గం మండలం దురదగుంట గ్రామ శివారులో ఓ ఎలుగుబంటిని గ్రామస్థులు కొండ ప్రాంతంలోకి తరిమివేశారు. మళ్లీ తాజాగా కంబదూరు మండలం ఎర్రబండలో గురుపాదం అనే మహిళపై ఎలుగుబంటి దాడి చేయడం కలకలం రేపుతోంది.
పంట పొలాల్లో ఎలుగుబంట్ల కలకలం.. ఏ క్షణం ఏం జరుగుతుందో..
Bear Attack on Woman: ఏపీలోని అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్లు ప్రజలను భయపెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలో సంచరిస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. బయటకు వెళ్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరినీ వెంటాడుతోంది. అటవీశాఖాధికారులు త్వరగా స్పందించి ఎలుగుబంట్లను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన మహిళపై ఎలుగుబంటి దాడి చేయగా.. తీవ్రగాయాలయ్యాయి. ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని బాధిత మహిళా వివరాల మేరకు కేసు నమోదు చేశారు. ఆమెకు పరిహారం అందేలా చూస్తామని కంబదూరు అటవీ అధికారి రామేశ్వరి తెలిపారు. ఇటీవల రోషన్ వలికొండ - ముదిగల్లు గ్రామాల మధ్య పంట పొలాల్లో వాటి సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పొలాలకు వెళ్లాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: