ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రోళ్ల మండలంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోళ్ల మండలం ఎం.రాయపురం, జీఎన్.పాలెం, రత్నగిరి, గుడ్డగుర్కి, జీబీ.హళ్ల, వన్నారనహళ్లి, కొడగార్లగుట్ట, జీజీ.హట్టీ, టీడీపల్లి గ్రామాల్లోని పంట పొలాల్లో ఎలుగుబంట్లు అధికంగా సంచరిస్తుంటాయి. ఎం.రాయపురం పంట పొలాల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. చెట్టెక్కిన ఎలుగు చాలా సేపు అక్కడే తిష్ఠ వేసింది.
Bear: చెట్టెక్కిన ఎలుగు... భయాందోళనల్లో ప్రజలు - ఎం.రాయపురంలో పొలాల్లో ఎలుగుబంట్లు వార్తలు
ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రోళ్ల మండలం పొలాల్లో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఓ పొలంలో ఎలుగుబంటి చెట్టెక్కి చాలా సేపు అక్కడే ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఎలుగు సంచారం
ఎలుగును చూసిన రైతులు ఆందోళనకు గురై.... కేకలు వేయడంతో చెట్టు నుంచి కిందకు దిగి పొలాల మీదుగా కొండల్లోకి వెళ్లిపోయింది. ఎలుగుబంట్ల వల్ల ఏ క్షణం ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి వాటి నుంచి రక్షించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:Rains in telangana: రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. నిండుతున్న చెరువులు