తెలంగాణ

telangana

ETV Bharat / city

మిడ్ ​మానేరు నిర్వాసితులకు ఏ సమస్యా రానివ్వొద్దు: కేటీఆర్

మిడ్​మానేరు నిర్వాసితుల సమస్యలను వెంటనే గుర్తించాలని మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. ప్రాజెక్టు పెండింగ్​ సమస్యలపై సమీక్షించిన ఆయన.. 18 ఏళ్లు దాటిన యువతీయువకులకు వెంటనే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ktr review on mid maner
నిర్వాసితుల పట్ల ఉదారంగా వ్యవహరించండి: కేటీఆర్​

By

Published : Dec 28, 2020, 10:55 PM IST

మిడ్​మానేరు ముంపు నిర్వాసితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్​ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పెండింగ్ సమస్యలపై సమీక్షించిన మంత్రి.. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితుల త్యాగం మరువలేనిదన్నారు.

పెండింగ్ సమస్యలను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉండి పరిహారం పొందని 701 సముదాయాలకు లబ్ధి చేకూరుస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు పరిహారం వెంటనే అందిస్తామని స్పష్టం చేశారు.

నిర్వాసితులందరికీ ఐఏవై ద్వారా గృహ నిర్మాణ పరిహారం చెల్లిస్తామని.. పెండింగ్‌లో ఉన్న ఆర్‌ అండ్‌ ఆర్ నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. మన్వాడ ప్యాకేజీపై మిగిలిన 197 మందికి పరిహారం అందిస్తామన్నారు.

ఇవీచూడండి:కేసీఆర్ కీలక నిర్ణయం... జలవనరుల శాఖకు కొత్త స్వరూపం

ABOUT THE AUTHOR

...view details