స్థానిక సంస్థల ఎన్నికలే దేశ పరిపాలనకు పునాది అని హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. స్థానిక సంస్థలు ఎంత దృఢంగా ఉంటే రాష్ట్రం అంత దృఢంగా ఉంటుందన్నారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్పొరేటర్ల సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీగా గెలవడం కంటే కార్పొరేటర్‌గా ఎన్నిక కావడం చాలా కష్టమని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. చట్ట సభలో బీసీలకు రిజర్వేషన్ కల్పించి.. బీసీ శాఖను ఏర్పాటు చేసినప్పుడే ఈ వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.