మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సంఘాలతో చర్చించిన అనంతరం క్లారిటీ ఇస్తామన్నారు. తెలంగాణలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి నాలుగు నెలలు అవుతున్నా ముందుకు సాగడం లేదని... తొందరలో భర్తీ చేస్తారని నమ్ముతున్నామని కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని... ఈ విషయంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ఈటలకు మద్దతుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం: ఆర్.కృష్ణయ్య - telangana varthalu
ఈటలకు మద్దతు ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ అంశాన్ని పక్కకు పెట్టేశారని విమర్శించారు.
ఈటలకు మద్దతుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం: ఆర్.కృష్ణయ్య
ఉద్యోగాల భర్తీపై ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు అడ్డుపడడంపై ఆక్షేపించారు. ఉద్యోగాల భర్తీ టీఎస్పీఎస్సీ ఛైర్మన్, పాలకవర్గ సభ్యుల నుంచే జరగాలని కృష్ణయ్య కోరారు. వ్యక్తుల మీద కంటే ఉద్యోగాల నోటిఫికేషన్ అంశంపై బీసీ సంఘం దృష్టి పెట్టిందని... దాని కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రగతి భవన్ వద్ద నర్సింగ్ అభ్యర్థుల ఆందోళన