బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని.. బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. బీసీలకు రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని కోరుతూ.. హైదరాబాద్ కాచిగూడలో బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో... రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీ ఉద్యమానికి ఉద్యోగులు నాయకత్వం వహించాలని ఆయన కోరారు.
ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం..