తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు (Bathukamma festival in telangana) ఘనంగా జరుపుకునేందుకు... వనితలు సన్నద్ధమైతున్నారు. తొలి రోజున జరిగే ఎంగిలిపూల బతుకమ్మలకోసం... ఉదయం నుంచి పూల సేకరణలో నిమగ్నమైయ్యారు. తీరొక్క పూలను తీసుకొచ్చి...పేర్చి...అందమైన బతుకమ్మలను తయారు చేస్తున్నారు. ఆటలు ఆడుతున్నారు... పాటలు పాడుతున్నారు.
హనుమకొండ వేయిస్తంభాల గుడి ఆవరణలోనూ పద్మాక్షి గుండం... ఇతర ఆలయాల వద్ద ఘనంగా పండుగ జరుపుకునేందుకు సిద్ధమైతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా...గత రెండేళ్లుగా పండుగ సరిగ్గా జరుపుకోలేదని.... దీంతో ఈసారి పండుగ ఎప్పుడెప్పుడు జరుపుకుంటామా అని ఎదురుచూస్తున్నట్లు మహిళలు తెలిపారు. హనుమకొండ నగరంలోని సిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులు బతుకమ్మ ఆటలు ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు, నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. వందలాదిమంది విద్యార్థులు ఒక చోట చేరి బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.