తెలంగాణ

telangana

ETV Bharat / city

Bathukamma celebrations in brussels: బ్రస్సెల్స్​లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు.. ఆడిపాడిన మహిళలు - dussehra festival celebrations in brussels

తెలంగాణ బతుకమ్మ పండుగ ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఉద్యోగాల నిమిత్తం వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు.. బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్​లో తెలుగు నాట్య కళామండలి ఆధ్వర్యంలో దసరా సంబురాలు ఘనంగా జరిపారు.

Bathukamma festival celebrations in brussels
బ్రస్సెల్స్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 17, 2021, 5:58 PM IST

Updated : Oct 17, 2021, 7:16 PM IST

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్​లో దసరా వేడుకలు సందడిగా సాగాయి. తెలుగు నాట్య కళా మండలి ఆధ్యర్యంలో తెలుగువారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దుర్గామాతను ఘనంగా అలంకరించి మహిళలు పూజలు చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై తెలుగు ఖ్యాతిని చాటారు.

వైభవంగా దుర్గామాత అలంకరణ
సాంప్రదాయ దుస్తుల్లో తెలుగు మహిళలు
సన్నిహితులు, కుటుంబ సభ్యులతో భోజనాలు

తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు, యువతులు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలకు కాలు కదుపుతూ నృత్యాలు చేశారు. కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. చిన్నారుల కోసం పలు వినోదాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం అందరూ తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనాలు చేశారు. అన్ని తెలుగు పండుగలను అందరూ కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని బ్రస్సెల్స్​లోని తెలుగువారు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో వినాయక చవితి వేడుకలు కూడా ఉత్సాహంగా జరుపుకున్నారు.

బ్రస్సెల్స్​లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

ఇదీ చదవండి:Electronic sales in festive season: ఎలక్ట్రానిక్​ ఉపకరణాల జోరు.. రెండింతలు పెరిగిన అమ్మకాలు

Last Updated : Oct 17, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details