రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు తెలంగాణ ప్రజల కులమతాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి తెలిపారు. వర్సిటీ టీచింగ్, నాన్-టీచింగ్ సంఘాల ఆధ్వర్యంలో పరిపాలన భవనం ముందు బతుకమ్మ సంబురాలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన గోపాల్‌రెడ్డి వేడుకలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని గోపాల్‌రెడ్డి అన్నారు.
ఓయూలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, నాన్-టీచింగ్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకున్న బతుకమ్మ వేడుకలను వర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి ప్రారంభించారు.
ఉస్మానియాలో వైభవంగా బతుకమ్మ వేడుకలు