తెలంగాణ

telangana

ETV Bharat / city

బతుకమ్మ సంబురం... అడిలైట్​లో ఎల్లలు లేని వైభవం - బతుకమ్మ సంబురాలు 2020

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబురాలు ఆస్ట్రేలియాలో వైభవంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి కారణంగా ఆంక్షలు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాలోని అడిలైడ్​లో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు.

ఎల్లలు లేని వైభవానికి వేదికైన అడిలైట్​.. ఘనంగా బతుకమ్మ
ఎల్లలు లేని వైభవానికి వేదికైన అడిలైట్​.. ఘనంగా బతుకమ్మ

By

Published : Oct 20, 2020, 4:26 PM IST

Updated : Oct 20, 2020, 4:50 PM IST

ఆస్ట్రేలియాలోని అడిలైట్​ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కొవిడ్ మహమ్మారి సమయంలో బతుకమ్మ వేడుకలను ప్రపంచంలోనే తొలిసారిగా తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ తెలిపింది. 300 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉత్సహంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.

అందంగా బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. కొంతమంది స్థానిక ఆస్ట్రేలియా వాసులు కూడా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడిలైడ్​లోని ఎల్డర్ పార్క్​లో వైభవంగా వేడుకలను నిర్వహించి టోరెన్స్ నదిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

ఎల్లలు లేని వైభవానికి వేదికైన అడిలైట్​.. ఘనంగా బతుకమ్మ

ఇవీ చూడండి:తిరుమలలో మోహినీ అవతారంలో వేంకటేశ్వరుడు

Last Updated : Oct 20, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details