తెలంగాణ

telangana

ETV Bharat / city

అమీర్​పేటలో అట్ల బతుకమ్మ సంబురాలు.. ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు - bathukamma celebrations 2021

హైదరాబాద్​ అమీర్​పేట డివిజన్​లో అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు.. ఉయ్యాల పాటలతో పరిసరాలు మారుమోగాయి. చిన్నారులు, యువతులు, మహిళలు.. ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు, కోలాటాలు ఆడుతూ మురిసిపోయారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి హాజరై.. మహిళలను ఉత్సాహపరిచారు.

bathukamma celebrations in ameerpet
bathukamma celebrations in ameerpet

By

Published : Oct 10, 2021, 10:10 PM IST

అమీర్​పేటలో అట్ల బతుకమ్మ సంబురాలు.. ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు
హైదరాబాద్​ అమీర్​పేట డివిజన్​లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ సరళ ఆధ్వర్యంలో ఐదో రోజు అట్ల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. పట్టు చీరలు కట్టుకుని అందగా ముస్తాబై.. అంతే అందంగా బతుకమ్మలతో వేడుకల్లో మహిళలు పాల్గొన్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని.. బతుకమ్మ ఆటలు ఆడారు. డప్పు చప్పులతో.. ఉయ్యాల పాటలతో.. ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఒకే వేషధారణతో ఉన్న ఓ మహిళల బృందం.. తలపై బోనాలు ఎత్తుకుని.. బతుకమ్మల చుట్టూ.. కోలాటాలు ఆడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి ప్రతీ బతుకమ్మ దగ్గరికి వెళ్లి.. పరిశీలించారు. అందంగా పేర్చి.. ముస్తాబు చేసిన విధానాన్ని అభినందించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని కిషన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. కాసేపు మహిళలతో సరదాగా ముచ్చటించారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఏటా భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.

మహిళల ఆటలను వీక్షించారు. సంస్కృతి సంప్రదాయాలను పాటించే విధంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని.. మహిళలను కిషన్ రెడ్డి కోరారు. అనంతరం.. కిషన్ రెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు మహిళలు ఉత్సాహం చూపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా నేతలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details