తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉగాండాలో అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు - దసరా పండుగ

తెలంగాణ బతుకమ్మ సంబురాలు ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. ఉగాండా దేశ రాజధాని కంపాలాలో తెలుగు ప్రజలు బతుకమ్మ పండుగను రంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

ఉగాండాలో అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 9, 2019, 2:40 PM IST


ఉగాండా రాజధాని కంపాలాలో తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్​ ఆఫ్​ ఉగాండా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రాంతాలకతీతంగా మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుకుంటూ కోలాటాలు ఆడారు. అనంతరం పక్కనే ఉన్న కొలనులో బతుకమ్మలు నిమజ్జనం చేసి పోయిరావమ్మా... బతుకమ్మ అని పాడుతూ వీడ్కోలు పలికారు. అత్యంత అద్భుతంగా జరిగిన ఈ వేడుకలకు పాశ్చాత్యులు ముగ్ధులయ్యారు. మున్ముందు జరిగే ప్రతి సంబురంలో తాముకూడా భాగస్వాములవుతామని తెలిపారు.

ఉగాండాలో అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు

ABOUT THE AUTHOR

...view details