Bathini Fish Prasadam : ఆస్తమా వ్యాధి నయం కోసం ప్రతి ఏడాది మృగశిక కార్తె ప్రవేశం రోజున చేపట్టే చేప ప్రసాదం పంపిణీ గత రెండేళ్లుగా కోరనా వల్ల నిలిచిపోయింది. ఈ ఏడాది కొవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ సంవత్సరం చేప పంపిణీ ఉంటుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ నిలిపివేశామని బత్తినిగౌడ్ సోదరులు తెలిపారు.
Bathini Fish Prasadam : 'ఈ ఏడాదీ చేప ప్రసాదం పంపిణీ లేదు' - బత్తిని చేప ప్రసాదం పంపిణీ నిలిపివేత
Bathini Fish Prasadam : ఆస్తమా రోగం నయం కోసం మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపట్టే చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది కూడా నిలిపివేశామని బత్తినిగౌడ్ సోదరులు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి కూడా చేపప్రసాదం పంపిణీని నిలిపివేశామని వారు స్పష్టం చేశారు.
Bathini Fish Prasadam
హైదరాబాద్ దూద్‌బౌలికి చెందిన బత్తిని హరినాథ్‌గౌడ్, బత్తిని గౌరీశంకర్‌గౌడ్, బత్తిని శివకుమార్‌గౌడ్, బత్తిని అమర్‌నాథ్‌గౌడ్‌లు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. కరోనా నేపథ్యంలో 2020 నుంచి పంపిణీ చేయడంలేదు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి కూడా చేపప్రసాదం పంపిణీని నిలిపివేశామని వారు స్పష్టం చేశారు.