రాష్ట్రంలో బార్ల లైసెన్సుల ఖరారు కోసం ఇవాళ, రేపు అబ్కారీ శాఖ అధికారులు లాటరీ తీయనున్నారు. ఈ మేరకు అబ్కారీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 22 అబ్కారీ జిల్లాల్లో లాటరీ తీసేందుకు రెవెన్యూ, అబ్కారీ శాఖల అధికారులు సర్వం సిద్ధం చేశారు.
నేడు, రేపు బార్ల లైసెన్స్లు... 22 జిల్లాల్లో లాటరీలు - bars in telangana
రాష్ట్రంలో బార్ల లైసెన్సుల ఖరారు కోసం లాటరీ తీసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో ఇవాళ, రేపు లాటరీ తీసేందుకు రెవెన్యూ, అబ్కారీ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.
bars license issue from today in Telangana through lottery system
ఇప్పటికే రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కాగా... రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నెల 18, 19 తేదీలల్లో నిర్వహించనున్న లాటరీ విధానానికి ఈసీ అనుమతించింది. ఇవాళ పురపాలక, రేపు గ్రేటర్ హైదరాబాద్లో ఈ లాటరీ విధానం అనుసరిస్తారని అధికారులు తెలిపారు.