పిట్ట కొంచెం.. కూత భయానకం!
రాత్రివేళ ఆహారం కోసం సంచరిస్తూ.. పగలు శిథిల భవనాల్లో విశ్రాంతి తీసుకునే చావుపిట్ట(బరన్ఓల్) ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కర్కశమైన కూతలు పెడుతూ భయంకరంగా కనిపించే ఈ పక్షి.. తాజాగా ఏపీలోని కొల్లేరులో అటవీ అధికారుల కంట పడింది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు చావుపిట్ట (బరన్‌ఓల్)గా పిలుస్తారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందాన దీని కూతలు భయంకరంగా, కర్కశమైన, బుసకొట్టినట్లు ఉంటాయి. పగలు సేదదీరుతూ.. రాత్రివేళ మాత్రమే ఆహారం కోసం సంచరిస్తుంది. శిథిల భవనాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, తూర్పు దేశాలైన మలేషియా, బంగ్లాదేశ్, ఫిలిఫైన్స్ ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈక్రమంలో సోమవారం కొల్లేరులో ఈ బుల్లి పిట్ట అటవీశాఖ అధికారుల కంటపడింది. దీని వింతైన ఆకారం పర్యాటకులను ఆకట్టుకుంది.
- ఇదీ చూడండి :సగం మగ.. సగం ఆడ.. ఆకట్టుకుంటున్న పక్షి