హైదరాబాద్ హైదర్‌గూడాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయంలో 113వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరోనా వారియర్స్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీఎం, జోనల్ హెడ్ శ్రీనివాస్.. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సాయిబాబా, పోలీసు అధికారి రమేశ్ రామినేని, జీహెచ్ఎంసీ ఉద్యోగి బాలమని, పారామెడికల్ స్టాఫ్ జైపాల్‌ను సత్కరించారు.
కరోనా వారియర్స్‌ను సత్కరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా - corona warriors felicitated by bank of Baroda
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలు కూడా లెక్కచేయకుండా సేవలందిస్తోన్న వారిని బ్యాంక్ ఆఫ్ బరోడా సత్కరించింది. 113వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ హైదర్‌గూడాలోని ప్రధాన కార్యాలయంలో కరోనా వారియర్స్‌ను సన్మానించినట్లు బ్యాంక్ జీఎం శ్రీనివాస్ తెలిపారు.

కరోనా వారియర్స్‌ను సత్కరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
ప్రతి ఏడాది ఎంతో ఆర్భాటంగా నిర్వహించుకునే వ్యవస్థాపక దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకున్నట్లు బ్యాంక్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నిరంతరం కష్టపడుతోన్న వారి సేవలు గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.