తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర ఉద్యోగుల సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల మద్దతు - bank employes

జనవరి 8న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బ్యాంకింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌లో సమావేశమై ఫెడరేషన్‌ నాయకులు నిర్ణయం ప్రకటించారు.

కేంద్ర ఉద్యోగుల సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల మద్దతు
కేంద్ర ఉద్యోగుల సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల మద్దతు

By

Published : Dec 20, 2019, 5:57 AM IST

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బ్యాంకింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అభిప్రాయపడింది. జనవరి 8న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఖాళీలను వెంటనే భర్తి చేయాలని ఫెడరేషన్‌ కార్యదర్శి రాంబాబు డిమాండ్‌ చేశారు. అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బ్యాంక్‌లను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ఉద్యోగుల సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల మద్దతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details