ఇప్పుడే నిజమైన పరీక్షా సమయమని, ఇలాంటి సమయంలోనే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని భారతీయ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓంప్రకాష్ మిశ్రా బ్యాంకు అధికారులు, సిబ్బందికి సూచించారు. డిజిటల్ లావాదేవీల వైపు ఖాతాదారులను ప్రోత్సహించాలన్నారు. బ్యాంకు డే వేడుకల్లో భాగంగా కోఠిలోని ఎస్‌బీఐ సర్కిల్ కార్యాలయంలో జ్యోతి వెలిగించి, చెట్లు నాటారు. సీజీఎం మిశ్ర, ఇతర ఉన్నతాధికారులు మాస్కులు ధరించి ఈ వేడుకకు హాజరయ్యారు.
'విపత్కర పరిస్థితుల్లోనూ మెరుగైన సేవలు అందించాలి' - bank day celebrations at hyderabad
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని, డిజిటల్ లావాదేవీల వైపు ఖాతాదారులను ప్రోత్సహించాలని ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓంప్రకాష్ మిశ్రా... బ్యాంకు అధికారులకు, సిబ్బందికి సూచించారు. బ్యాంకు డే సందర్భంగా కోఠిలోని ఎస్‌బీఐ సర్కిల్ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి, మొక్కలు నాటారు.
ఇలాంటి సమయంలోనే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి
ఏటీఎంలు, సీడీఎంలు, రీసైకిలర్స్, మైక్రో ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల-ఎనీటైమ్ ఛానెల్స్ ద్వారా తమ బ్యాంకు సేవలు అన్ని వేళల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. యోనో యాప్‌ను లక్షలాది మంది ఖాతాదారులు వాడుతున్నారన్నారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. తద్వారా తమను, వ్యక్తిగతంగా ఖాతాదారులను కాపాడుకున్నట్లవుతుందని సూచించారు.
Last Updated : Jul 2, 2020, 5:01 PM IST