తెలంగాణ

telangana

ETV Bharat / city

TPCC chairman Revanth reddy news today : 'ఇందిరాగాంధీ సాహసం నేటితరానికి తెలియాలి' - Revanth reddy on Bangladesh liberation day

TPCC chairman Revanth reddy news today: ఇందిరాగాంధీ సాహసం, సమయస్ఫూర్తి నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాలన్ని ఒకవైపున్నా.. .. ఆమె పాకిస్థాన్​పై యుద్ధం ప్రకటించారని తెలిపారు.

TPCC chairman Revanth reddy news today, టీపీసీ ఛైర్మన్ రేవంత్ రెడ్డి
TPCC chairman Revanth

By

Published : Nov 23, 2021, 3:23 PM IST

TPCC chairman Revanth reddy news today: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సాహసం నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలన్ని ఒకవైపున్నప్పటికీ పాకిస్థాన్‌పై ఆమె యుద్దం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్‌ లిబరేషన్ వార్.. ఇండో-పాక్‌ యుద్ధం 1971 అంశాలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు.

భారతదేశాన్ని.. ఇందిరాగాంధీని విడదీసి చూడలేమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌.. ఇందిరా గాంధీని దుర్గాదేవిగా అభివర్ణించారని గుర్తు చేశారు.

Bangladesh 50th Liberation Day: ఇండియాపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చినా.... దేశ సరిహద్దులో అమెరికన్‌ సైనికులు మోహరించినా..... భయపడకుండా భారత సైనికులు వాళ్లని ఢీకొట్టేలా వారిలో ధైర్యాన్ని నింపారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టమని.... ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. ఇంతటి ఘన చరిత్ర నేటి తరానికి తెలియజేయాలన్న సోనియాగాంధీ ఆదేశాల మేరకు.. ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ బంగ్లాదేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ దావర్, మాజీ ఆర్మీ అధికారి ఏఆర్‌కే రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్ రెడ్డి, మహేశ్​కుమార్ గౌడ్‌, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details