తెలంగాణ

telangana

ETV Bharat / city

'పోలీస్​ కటాఫ్ మార్కుల్లో వారికి మినహాయింపు ఇవ్వకపోవడం దారుణం' - EWS Reservations

Bandi Sanjay letter to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ లేఖ రాశారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు.. రాష్ట్రప్రభుత్వం విస్మరిస్తోందని లేఖలో ఆరోపించారు. దీనివల్ల పోలీస్ రిక్రూట్​మెంట్​ బోర్డు​ పరీక్షలు రాసిన అభ్యర్థులు నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

Bandi Sanjay wrote a letter to KCR
Bandi Sanjay wrote a letter to KCR

By

Published : Oct 9, 2022, 11:50 AM IST

Bandi Sanjay Letter to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు నోటిఫికేషన్​లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని.. ఈ సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని లేఖలో వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బండి సంజయ్​ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ రిక్రూట్​బోర్టు నోటిఫికేషన్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చి.. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకూ కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ.. పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు నోటిఫికేషన్​ను సవరించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details