దుబ్బాక ఉప ఎన్నిక శాంతిభద్రతల పరిశీలకుడిగా ఐపీఎస్ అధికారి సరోజ్‌కుమార్ ఠాకూర్ నియామకాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సరోజ్ కుమార్ ఠాకూర్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: బండి
పోలీసులను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల శాంతిభద్రతల పరిశీలకుడి నియామకాన్ని స్వాగతిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
సరోజ్ కుమార్ ఠాకూర్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: బండి
భాజపా అభ్యర్థితో పాటు వారి కుటుంబసభ్యులను, కార్యకర్తలను సోదాల పేరుతో వేధిస్తూ... ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా... శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:బిహార్‌లో తొలిదశ పోలింగ్ ప్రశాంతం