మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender) తెలంగాణ సాధనలో కీలక భూమి పోషించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. నియంత పాలన నుంచి బయటకొచ్చిన ఈటలకు ఘనస్వాగతం పలికారు. తన బృందానికి పార్టీలోకి వెల్కమ్ చెప్పారు.
Bandi Sanjay : 'నియంత పాలన నుంచి ఈటలకు విముక్తి' - telangana bjp state president bandi sanjay
మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender).. నియంత పాలన నుంచి బయటకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. దిల్లీలో కాషాయ తీర్థం పుచ్చుకున్న ఈటల, ఆయన బృందానికి ఘన స్వాగతం పలికారు.
బండి సంజయ్, ఈటలకు బండి స్వాగతం, ఈటల చేరికపై బండి సంజయ్
కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం భాజపాకే ఉన్నాయని బండి సంజయ్(Bandi Sanjay) పునరుద్ఘాటించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వంపై విశ్వాసంతో ఈటల(Etela Rajender), ఆయన బృందం పార్టీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు.
Last Updated : Jun 14, 2021, 2:49 PM IST