Bandi Sanjay Visit Khairatabad Ganesh: కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో విడిపోయిన హిందూ సమాజాన్ని ఏకం చేయటానికే గణనాధుడి నవరాత్రులు నిర్వహించటం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. భాజపా జమ్ము కాశ్మీర్ ఇంఛార్జ్ తరుణ్‌చుగ్‌తో కలిసి బండి సంజయ్ ఖైరతాబాద్ భారీ గణపతిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వారి వెంట ఉన్నారు.
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న బండి సంజయ్ - ఖైరతాబాద్ తాజా వార్తలు
Bandi Sanjay Visit Khairatabad Ganesh: దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్ తిలక్ ఆనాడు వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఖైరతాబాద్ భారీ గణపతిని ఆ పార్టీ జమ్ము కాశ్మీర్ ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏకదంతుడికి 110 అడుగుల కండువా బహుకరించారు.

Bandi Sanjay
ఆనాడు దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని బండి సంజయ్ అన్నారు. ఈ వేడుకల ద్వారా హిందూ సమాజం సంఘటిత శక్తి నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏకదంతుడికి 110అడుగుల కండువా, 25 కిలోల లడ్డూను భాజపా నేతలు బహుకరించారు.
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకొన్న బండి సంజయ్
ఇవీ చదవండి: