Proposal to name parliament Building after Ambedkar : దిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల బండి సంజయ్‌ను కలిసిన ప్రజాగాయకుడు గద్దర్ పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతి పత్రం సమర్పించారు. గద్దర్ విజ్ఞప్తిని బండి కేంద్రానికి పంపించారు.
పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్ - bandi sanjaya padaytra news
Proposal to name parliament Building after Ambedkar : దిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల బండిని కలిసిన ప్రజా గాయకుడుగద్దర్ ఈ విజ్ఞప్తిని చేయగా.. గద్దర్ వినతిని బండి కేంద్రానికి పంపించారు. మరోవైపు పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తీర్మానం చేయడం గమనార్హం.
Proposal to name parliament New Building after Ambedkar : ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత కొనసాగుతోంది. మూడో రోజు హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కమ్యూనిటీ సెంటర్ వద్ద మొదలైన యాత్రకు క్షత్రియ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మంగళవారం వీఆర్‌ఏలపై జరిగిన లాఠీఛార్జీని నిరసిస్తూ బండి సంజయ్, భాజాపా నాయకులు నల్ల కండువా ధరించి యాత్రలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో పలువురు కాలనీవాసులు తమ సమస్యలను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరగా రాబోయేది భాజపా ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యా వైద్యం అందించడంతోపాటు అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. అంతకుముందు ఇటీవల మృతిచెందిన కేంద్ర మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు చిత్రపటానికి బండి సంజయ్ నివాళులర్పించారు.