కరోనా కట్టడికి, కొవిడ్ పేషంట్లను ఆదుకోవడానికి ప్రధాని మోదీ(pm modi) రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) అన్నారు. కరోనా బాధితుల విషయంలో ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని... ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో ఏ దేశ ప్రభుత్వం కూడా ఆలోచించి ఉండదన్నారు. కరోనాతో అనాధలైన చిన్నారుల బంగారు భవిష్యత్తు బాధ్యతను పీఎం కేర్స్ (PM CARES) ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాన మంత్రి ప్రకటించినందుకు... తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
కరోనావల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు విద్యానందించే పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. బావిభారత పౌరులైన ఈ చిన్నారుల రక్షణ, పూర్తి సపోర్ట్ కేంద్రం ఇస్తుందని... పీఎం కేర్స్ ద్వారా చిన్నారులకు పూర్తిగా ఉచిత విద్యను కేంద్ర ప్రభుత్వం అందించబోతోందన్నారు. పది ఏళ్ల లోపు పిల్లలైతే దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయంలో కాని, ఏదైనా ప్రైవేటు స్కూల్ లోని కానీ పూర్తి ఖర్చులను భరించి కేంద్ర ప్రభుత్వమే చదివిస్తుందని పేర్కొన్నారు.