భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్యపై తెరాస ప్రభుత్వం కేసులు నమోదు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై విద్యార్థులు, యువకుల తరఫున ప్రశ్నలు సంధించిన తేజస్వీ సూర్యను అడ్డుకోవాలని చూడడం ప్రజాస్వామికమన్నారు. ఇది ముమ్మాటికి కక్షసాధింపు చర్యేనని ఆరోపించారు.
'లక్ష ఉద్యోగాల హామీపై కేసీఆర్ సమాధానం చెప్పాలి' - case filed on bjp leader tejasvi surya
భాజపా నేతల తేజస్వీ సూర్యపై హైదరాబాద్లోని ఓయూ పీఎస్లో నమోదైన కేసుపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తేజస్వీ సూర్యపై కేసును తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు కల్పించినా... యువత పక్షాన పోరాడుతామన్నారు.
bandi sanjay responded on tejasvi surya case in ou
కేసులు, అరెస్టులకు భయపడే పార్టీ భాజపా కాదని సంజయ్ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించినా... విద్యార్థులు, నిరుద్యోగులు, యువకుల పక్షాన పోరాడుతుందన్నారు. విద్యార్థుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్... లక్ష ఉద్యోగాల హామీపై సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.