Bandi Sanjay Request to NRIs : భాజపా చేస్తున్న మహోద్యమంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని వాపోయారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే భాజపా లక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఏక్ దక్కా- తెలంగాణ పక్కా అనే అంశంపై నిర్వహించిన జూమ్ సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
Bandi Sanjay Talks to NRIs : "రాష్ట్రంలో తెరాస అవినీతి పాలన నడుస్తోంది. కేసీఆర్ కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి. తెరాస పాలనలో తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్నారు. వారి కోసమే భాజపా న్యాయ పోరాటం చేస్తోంది. కేసీఆర్ నియంత పాలన నుంచి విముక్తి కోసం అహర్నిశలు కాషాయ జెండా పోరాడుతోంది. ఈ పోరాటంలో మాకు మీ మద్దతు కావాలి. పరాయి దేశంలో ఉన్నా.. మాతృభూమి గురించి ఆలోచించే మీరంతా భాజపాకు అండగా నిలవాలి."