తెలంగాణ

telangana

ETV Bharat / city

'వైద్యులకు శుభాకాంక్షలు చెప్పే సమయం కేసీఆర్​కు లేదా..?' - భాజపా వర్చువల్​ ర్యాలీ

కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్న వైద్యులకు శుభాకాంక్షలు చెప్పే సమయం లేదా అని ముఖ్యమంత్రి కేసీఆర్​ను.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రశ్నించారు. హైదరాబాద్​లో నిర్వహించిన భాజపా జనసంవాద్​ వర్చువల్​ ర్యాలీకి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్​తో కలిసి ఆయన హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్​, ఖమ్మం జిల్లాల కార్యకర్తలు హాజరయ్యారు.

bandi sanjay
'వైద్యులకు శుభాకాంక్షలు చెప్పే సమయం కేసీఆర్​కు లేదా..?'

By

Published : Jul 1, 2020, 8:34 PM IST

డాక్టర్స్ డే సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారన్నారు. హైదరాబాద్​లో భాజపా జన సంవాద్ సభ వర్చువల్ ర్యాలీలో.. ఉమ్మడి వరంగల్​, ఖమ్మం జిల్లాల కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్​ హాజరయ్యారు.

కరోనా నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతున్న వైద్యులకు శుభాకాంక్షలు చెప్పే సమయం లేదా అని కేసీఆర్​ను బండి సంజయ్​ ప్రశ్నించారు. దేశ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ లాక్‌డౌన్ ప్రకటించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నవంబరు వరకు 80 కోట్లమంది పేదలకు ఉచిత రేషన్ ప్రకటించిందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఖర్చుపెట్టిన ప్రతి పైసా కేంద్రానిదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎక్కడ కూడా మోదీ ఫోటో పెట్టలేదని.. కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా.. ప్రజలను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్రం రూ.7150 కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి:లాక్​డౌన్​ ఊహాగానాలు.. కిటకిలాడుతున్న రైలు, బస్ స్టేషన్లు

ABOUT THE AUTHOR

...view details