తెలంగాణ

telangana

ETV Bharat / city

'అందుకే రైస్​ మిల్లుల్లో బియ్యం గుట్టలుగా మిగిలిపోయింది' - బండి సంజయ్

రాష్ట్రంలో బియ్యం సేకరణ గడువును మరో నెల పొడిగించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందన్నారు భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఏప్రిల్, మే నెలల్లో పంపిణీ చేయకుండా నిలిపివేసిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బండి సంజయ్
బండి సంజయ్

By

Published : Jul 9, 2022, 3:53 AM IST

బియ్యం సేకరణ గడువును నెలరోజులు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయెల్, శాఖ కార్యదర్శి సుధాంసు పాండేలను దిల్లీలో బండి సంజయ్ కలిశారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను, రైస్‌ మిల్లర్ల సమస్యలను వారికి వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం.. గరీబ్ కళ్యాణ్ బియ్యం పంపిణీ ఆపేసిన కారణంగానే రైస్ మిల్లులో బియ్యం గుట్టలుగా మిగిలిపోయిందని బండి సంజయ్ విమర్శించారు. బియ్యం సేకరణ గడువును మరో నెల పొడిగించాల్సిందిగా కోరగా అందుకు కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. మరోవైపు ఏప్రిల్, మే నెలల్లో పంపిణీ చేయకుండా నిలిపివేసిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వాల్సిందేనని సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి :తెరాసలో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

ABOUT THE AUTHOR

...view details