Bandi Sanjay letter to KCR: రైతు రుణ మాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఇప్పటివరకు 5.66 లక్షల రైతులకు రుణమాఫీ జరిగిందని.. ఇంకా 31 లక్ష మంది అన్నదాతలకు మాఫీ జరగాల్సి ఉందని లేఖలో వెల్లడించారు. ఆ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు.
అదే విధంగా రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి రక్షణ లేదని బండి సంజయ్ లేఖలో తెలిపారు. వారి రక్షణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 14 లక్షల మంది కౌలుదారులకు ఎలాంటి భరోసా లేదని.. వారిని ఆదుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.