తెలంగాణ ప్రభుత్వం కరోనాను గుర్తించే పరీక్షలు ఆపేసిందని, ఐసీఎంఆర్ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం కరోనా చికిత్సలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సదుపాయాలు సరిగ్గా లేవని ఆరోపించారు. ఆస్పత్రుల ప్రాంగణాల్లో పరిశుభ్రమైన పరిస్థితులు నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయని, సరిపడా సిబ్బంది కూడా లేరని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. కరోనా పరీక్షలకు సరిపడా సౌకర్యాలు తక్కువగా ఉండడం, రోజురోజుకు కేసులు పెరుగుతుండడం వల్ల ప్రభుత్వం పరీక్షలు తగ్గించి.. తక్కువ కేసులు చూపించే ప్రయత్నం చేస్తున్నదని లేఖలో వివరించారు.
కరోనా పరిస్థితులపై కేంద్రానికి బండి సంజయ్ లేఖ - రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసిన బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కరోనా పరీక్షలు చేయించడం లేదని భాజాపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచి.. ఇటు కేంద్రాన్ని, అటు ప్రజలను మోసం చేస్తోందని అరోపించారు. అదృశ్య శత్రువైన కరోనా వైరస్ మీద చేసే పోరాటంలో ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంబించడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, చికిత్స తీరులు, వైద్య సదుపాయాలను సమీక్షించడానికి బృందాన్ని పంపించాలని కోరారు.