Bandi Sanjay on CM KCR: రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం స్వయంగా ఆ సమస్యలు సృష్టించడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు తెరాస, మజ్లిస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. దిల్లీ లిక్కర్ స్కాం, ఈడీ సోదాల్లో ముఖ్యమంత్రి కుటుంబీకుల పేర్లపై చర్చ జరుగుతోందని బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిని పక్కదోవ పట్టించేందుకే ఈ కుట్ర చేసినట్లు ఆరోపించారు.
శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం, సమస్య సృష్టించడం దారుణమన్న బండి సంజయ్ - కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay on CM KCR రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు తెరాస, మజ్లిస్ కుట్ర పన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం స్వయంగా శాంతి భద్రతల సమస్య సృష్టించే కుట్ర చేయడం దుర్మార్గమైందని ఒక ప్రకటనలో మండిపడ్డారు. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ దాడుల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిని పక్కదోవ పట్టించేందుకే ఈ కుట్ర చేసినట్లు ఆరోపించారు.
మునావర్ ఫారుఖీ అనే వ్యక్తి హిందూ దేవతలని కించపరిచేలా మాట్లాడితే.. అనేక రాష్ట్రాలు అతని షోను నిషేధించాయని గుర్తు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో మునావర్ ఫారూఖీని రాష్ట్రానికి మళ్లీ ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత కల్పించి మునావర్ ఫారూఖీ షో నిర్వహించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు. ఈ షో ను మళ్లీ కావాలని హైదరాబాద్ లో పెట్టించడం అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా అన్నారు. ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటోందని దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్ సహా రాష్ట్రమంతా దారుణమైన కుట్రకు ప్లాన్ చేసినట్లు అనుమానం కలుగుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా, సంయమనంతో ఉండాలని సంజయ్ కోరారు.