తెలంగాణ

telangana

ETV Bharat / city

అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్ అంటూ టీఆర్​ఎస్ ట్రోలింగ్ - bandi sanjay helps amit shah to wear sandals

Bandi Sanjay Controversy over Carrying Amit shah chappals మునుగోడు పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా మొదట సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని సందర్శించారు. అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయం బయటకు అమిత్ షా వచ్చినప్పుడు ఆయన వెంటే ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏదో తీసినట్లు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఓవైపు తెరాస, మరోవైపు నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిపై విమర్శలు చేస్తున్నారు.

Bandi Sanjay in Amit Shah Munugode Tour
Bandi Sanjay in Amit Shah Munugode Tour

By

Published : Aug 22, 2022, 10:28 AM IST

Updated : Aug 22, 2022, 11:15 AM IST

Bandi Sanjay Controversy over Carrying Amit shah chappals : కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటనకు ముందు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా బయటకు వస్తుండగా ఆయన వెంటే ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. షా కంటే ముందు వెళ్లి ఆయన చెప్పులు తీసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై తెరాస సోషల్ మీడియా ఇంఛార్జ్ గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా..? అంటూ పోస్టు చేయగా.. ఇతర శ్రేణులు ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా దీన్ని రీట్వీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సైతం స్పందించారు. బండి సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ ఆయన వీడియో విడుదల చేశారు.

"దిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను(బండి సంజయ్​ని ఉద్దేశిస్తూ), దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ని(కేసీఆర్​ను ఉద్దేశిస్తూ)- తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉంది" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు బానిసత్వాన్ని పరిచయం చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచారని ఆరోపించారు. మునుగోడు ఆత్మగౌరవంగా చెబుతున్న భాజపా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్‌ షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందన్నారు.

Last Updated : Aug 22, 2022, 11:15 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details